banana poori
బనానా పూరీ
కావలసినవి
అరటిపండులు - 2
పంచదార - 4 టేబుల్ స్పూన్లు
జిల్లాకర్రపొడీ - 1/2 టీ స్పూన్
గోధుమ పిండి - ఒకటిన్నర కప్పు
పెరుగు - టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా - పావు టీ స్పూన్
ఉప్పు - చిటికెడు
నెయ్యి - టేబుల్ స్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం :
- ఓ గిన్నెలో అరటిపండులా గుజ్జు వేయాలి . అందులోనే పంచదార,జిల్లాకర్రపొడీ ,ఉప్పు వేసి కలపాలి.ఇప్పుడు దీన్ని ఓ గరిటతో మెత్తగా అయ్యేలా కలపాలి.
- అందులోనే గోడిమపిండి,పెరుగు,నెయ్యి,బేకింగ్ సోడా వేసి కలపాలి ,పిండిముద్ద మరి గట్టిగ ఉంటాయి మరికాస్త పెరుగు వేసి కలపాలి.
- చేతులకి కాస్త నెయ్యి రాసుకుని పిండిని మెత్తగా కలిపి ముట్టపెట్టి సుమారు ఎనిమిది గంటలపాటు నాననివ్వాలి. ఇందులో నీళ్లు అసలు పోయకూడదు.
- తరువాత ముద్దను చిన్న ఉండల్లా చేసి మండపాటి పూరీలా చేసి కాగిన నూనెలో వేయించి తీయాలి.
- వేడిగానే కాదు,చలిరిన కూడా బాగుంటుంది.
No comments:
Post a Comment