pancharatan halwa
పంచరతన్ హల్వా
కావలసినవి :
ఖర్జురాలు - 20
ద్రాక్ష - పావు కప్పు
బెల్లం తురుము - అర కప్పు
పంచదార - పావు కప్పు
బాదాం,జీడిపప్పు - కప్పు
కొబ్బరి తురుము - అరకప్పు
నెయ్యి - 3టేబుల్స్పూన్లు
గసగసాలు - 2 టీ స్పూన్లు
తయారుచేసేవిధానం:
- ఖర్జురాలో గింజలు తీసి ఓ బాణలి లో వేయాలి. అందులోనే ఎండుద్రాక్ష కూడా అవి మునిగే వరుకు నీళ్లు వేసి మెత్తగా అయేవారుకూ ఉడికించి దించాలి.
- మిక్సీలో బాదాం,జీడిపప్పు వేసి కాస్త గరుక గ ఉండేలా పొడి చేయాలి. ఇప్పుడు దీని విడిగా తీసి ఉంచాలి.
- అదే మిక్సీలో చలర్చిన ఖర్జురాలు,ఎండు ద్రాక్ష వేసి మెత్తగా చేయాలి. తరువాత బాదాం,జీడిపప్పు కూడా వేసి ఒకసారి తిప్పాలి.
- బాణలిలో బెల్లం,పంచదార వేసి అవి ముంగేవారుకూ నీళ్లు వేసి గరిటతో తిప్పుతూ చిక్కని ఉండ పాకం వచేవారుకూ ఉడికించాలి .
- ఇప్పుడు అందులో కొబ్బరి రుబ్బిన ఖర్జురా మిశ్రమం వేసి ,నెయ్యి కూడా వేసి బాగా తిప్పుతూ ఉడికించాలి ,మిశ్రమం దగ్గరగా ఉడికి బాగా చిక్కబడ్డాక గసగసాలు చల్లాలి.
- ఇప్పుడు దీన్ని మరోసారి కలిపి నేయి రాసిన ప్లేటులో వేసి అరక ముక్కలుగా కొయ్యాలి.
No comments:
Post a Comment