pepper chicken in telugu
పెప్పర్ చికెన్
కావలసినవి:
చికెన్ - అరా కిలో
అల్లంవెల్లులి - 3 టేబుల్స్పూన్లు
పసుపు - టీ స్పూన్
ఉప్పు - సరిపడా
ఉల్లిపాయ ముక్కలు- కప్పు
మిరియాలపొడి - ఒకటిన్నర టీ
స్పూన్
కారం - 4 టీస్పూన్ల
గరం మసాలా - టీ స్పూన్
కరివేపాకు - కట్ట
జీలకర్ర - అరా టీస్పూన్
యాలకులు - మూడు
దాల్చిన చెక్క - అంగుళంముక్క
లవంగాలు - నాలుగు
నూనె - 3 టేబుల్స్పూన్లు
తయారుచేసేవిధానం:
- చికెన్ ముక్కలికి కాస్త ఉప్పు,టబుల్ స్పూన్ అల్లం వెల్లులి,పసుపు పాటించి పక్కన ఉంచాలి.
- నాన్స్టిక్ ఫాంలో జీలకర్ర,దాల్చిన చెక్క,లవంగాలు,యాలకులు వేసి వేయంచాలి.తరువాత మిగిలిన అల్లం వెల్లులి వేసి వేగాక ఉల్లిముక్కలు,ఉప్పు వేసి వేయంచాలి.
- కారం,గరం మసాలా,కచ్చా పచ్చగా దంచిన మిరియాలపొడి వేసి నూనె బయటకు వచ్చాయీ వరుకు వేయించాలి.
- ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా మరో నాలుగు నిముషములు వేయించి,మూతపెట్టి ముక్క పూర్తిగా ఉడికేవరుకు ఉంచి దించాలి